ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ..

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆదివారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 3.30 కు సెక్రటేరియట్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. 6 గ్యారంటీల అమలు, ఉద్యోగాల భర్తీ, 4 వేల రూపాయల పెన్షన్ వంటి పథకాలపై కీలకంగా చర్చించనున్నారు మంత్రులు. 

రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపైనా శ్వేత పత్రం విడుదల పైనా డిస్కస్ చేసే చాన్సుంది. ఈ నెల 8 నుంచి నిర్వహించే బడ్జెట్ సెషన్ పై మంత్రులతో మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి. 10 న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 12 నుంచి 5 రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది సర్కార్.