జూన్ 21న తెలంగాణ కేబినెట్ భేటీ

జూన్ 21న తెలంగాణ కేబినెట్ భేటీ

జూన్  21న తెలంగాణ  కేబినెట్  సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది.  ఆగస్ట్ 15 లోపు రుణమాఫీ   చేస్తామని చెప్పిన నేపథ్యంలో  కేబినెట్​ భేటీలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారుచేసే అవకాశాలు ఉన్నాయి. 

రాబోయే ఐదేళ్లకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపైనా చర్చించే అవకాశం ఉంది. అలాగే పంటల బీమా, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ పై చర్చించనున్నారు.