హైదరాబాద్, వెలుగు: కేబినెట్ మీటింగ్వాయిదా పడింది. తొలుత ఈ నెల 23న సమావేశంఉంటుందని ప్రకటించగా.. దానిని వాయిదా వేశారు. శనివారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే శనివారం సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియెట్లో కేబినెట్ మీటింగ్ ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇద్దరు మంత్రులు 23న అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తున్నది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.. సియోల్ నది శుద్ధి, సుందరీకరణ తీరును స్టడీ చేసేందుకు సౌత్ కొరియాకు వెళ్లారు. ఈ నెల 25న వారు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. దీంతో భేటీ వాయిదా వేసినట్టు తెలిసింది.