
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై వేసిన నిందను ఖండించారు సీఎం. కాంగ్రెస్ పార్టీని తాను సపోర్ట్ చేయడం లేదన్నారు. కానీ రాహుల్ పై వేసిన నిందను మాత్రం ఖండిస్తున్నానన్నారు. ఇదేం పద్దతి అలా మాట్లాడొచ్చా అంటూ కేసీఆర్ మండిపడ్డారు. రాజకీయాల్లో అనుసరించాల్సిన పద్దతి కానే కాదన్నారు. ఇది ఖండనీయం.. సహించనీయమన్నారు. ఉద్యమ సమయంలో తాను సోనియాపై అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనకు అలాంటి భాషా రానే రాదన్నారు కేసీఆర్. అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడే దుర్మార్గపు మాటలు తాను ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఈ తరహా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు.
ఇవి కూడా చదవండి:
బీజేపీ అవినీతిపై ఢిల్లీలో పంచాయితీ పెడ్తా
మేడారం జాతరపై కేంద్రం కీలక ప్రకటన