మేడారం జాతరపై కేంద్రం కీలక ప్రకటన

మేడారం జాతరపై కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణ ప్రజలకు కేంద్రం శుభవార్త జరిపింది. భారతేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. 2.5 కోట్ల నిధుల విడుదలకు భారత ప్రభుత్వం ఆమోదించింది. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజుల్లో జరుపుతారు. ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 16 నుండి 19వ తేదీ వరకు జర గబోతున్న ఈ జాతరకు కోటి యాభై లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా. 

మేడారం జాతరను.. జాతీయ పండుగగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. మేడారం జాతరకు జాతీయ హోదా తెచ్చి, ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ తరఫున మంత్రులు, ప్రజాప్రతినిధులు పలు సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడం, వినతిపత్రాలు అందజేయడం జరిగింది. అయితే తాజాగా మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. 

ఇవి కూడా చదవండి:

రేపు అన్ని పోలీస్ స్టేషన్లలో సీఎం హిమంత శర్మపై కేసులు

మేడారానికి పోటెత్తిన భక్తులు