ఇథియోపియో డిప్యూటీ పీఎంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ఇథియోపియో డిప్యూటీ పీఎంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావాస్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండి బోర్గ్, ఇథియోఫియా డిప్యూటీ పీఎం మేకొనెన్‌తో రేవంత్ భేటీ అయ్యారు. సమగ్ర అభివృద్ధితో సరికొత్త తెలంగాణ నిర్మాణంలో భాగం అయ్యేందుకు NRI లు ఉత్సాహం చూపిస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు. 

ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై రేపు(జనవరి 17) జరగనున్న సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, నైపుణ్యం పెంచే అంశాలపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్‌ రెడ్డితో ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సహ ప్రత్యేక కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి, సీఎంవో ఉన్నతాధికారులు శేషాద్రి, అజిత్ రెడ్డి ఉన్నారు.

అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డికి.. జ్యురిచ్ లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీల కీలకనేతతో రేవంత్ రెడ్డి సమావేశం అవుతున్నారు. 

కాగా, మరో 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలను కలవబోతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ప్రఖ్యాత కంపెనీలు అయిన నొవార్టీస్, మెడ్ ట్రానిక్స్, ఆస్ట్రాజెంకా, గూగుల్, ఉబర్ తోపాటు  బేయర్, LDC, యూపీఎల్ కంపెనీల ప్రతినిధులతో భేటీకానున్నట్లు తెలిపారు.