మేడారానికి ఆన్​లైన్​లో బంగారం సమర్పించిన సీఎం

మేడారానికి  ఆన్​లైన్​లో బంగారం సమర్పించిన  సీఎం
  • పీసీబీ రూపొందించిన పోస్టర్  ఆవిష్కరణ

హైదరాబాద్ ,వెలుగు : ఆన్ లైన్ లో మేడారం సమ్మక్క-సారక్కకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని  సీఎం రేవంత్  రెడ్డి శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్ లో ప్రారంభించారు.  తన మనవడు రియాన్ష్ తో కలిసి నిలువెత్తు బంగారాన్ని ఆన్ లైన్ లో సీఎం సమర్పించారు. అలాగే తన మనవరాలితో కలిసి నిలువెత్తు బంగారాన్ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆన్ లైన్ లో సమర్పించారు.

 మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఆన్ లైన్ లో నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. అనంతరం మేడారం మహాజాతరలో ప్లాస్టిక్  వినియోగాన్ని నిషేధిస్తూ, జాతరను పరిశుభ్రంగా జరుపుకోవాలని కోరుతూ  పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్  ( పీసీబీ) రూపొందించిన పోస్టర్ ను మంత్రులు సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్​తో కలిసి   సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.