బీఆర్ఎస్ టికెట్ల కోసం పోటీ..చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి

బీఆర్ఎస్ టికెట్ల కోసం పోటీ..చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి

బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి రోజురోజుకు ముదురుతోంది. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల విష‌యంలో అసంతృప్తులు, టికెట్ ఆశించిన వారు తిరుగుబాటు చేస్తున్నారు. బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతోపాటు ఆందోళ‌న‌ల‌కు దిగుతున్నారు కార్య‌క‌ర్త‌లు, నేత‌లు. ఒక‌టీ అరా కాదు.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇలాంటి ప‌రిస్థితులే ఉన్నాయి.

నాగార్జునసాగర్, నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల బీఆర్ఎస్ ​టికెట్లను బీసీ లీడర్లు ఆశించారు. నల్గొండలో పిల్లి రామరాజు యాదవ్, సాగర్​లో మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ మన మడు రంజిత్ యాదవ్, మునుగోడులో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్​రెడ్డి, విద్యాసాగర్ టికెట్ కోసం ప్రయత్నించారు. సిట్టింగులకే సీట్లు కేటాయించడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. నాలుగైదు రోజులుగా పార్టీ లీడర్లు, కుల సంఘాలతో భేటీ అవుతున్నారు. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి పో టీ చేయాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు అనురాధను బీఆర్ఎస్ లీడర్లు సంప్రదించారు. ఆమె గ్రీన్​సిగ్నల్ ​ఇచ్చినప్పటికీ చివరి క్షణం లో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియకే టికెట్ ఇచ్చారు. దీంతో అనురాధ ఇండిపెండెంట్​గా పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. భద్రాచలం టికెట్ కోసం మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చయ్య తీవ్రంగా ప్రయత్నించారు. కానీ తెల్లం వెంకట్రావ్​కు టికెట్ ఇవ్వడంతో ఆయన నారాజ్ అయ్యారు.   

 పటాన్​చెరు నియోజకవర్గం నుంచి చిట్కుల్ గ్రామ సర్పంచ్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలం మధు బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. నిజానికి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈసారి నీలం మధుకు టికెట్​ఖాయమని భావించారు. కానీ మరోసారి గూడెం మహిపాల్​రెడ్డికి టికెట్ కేటాయించడంపై మధు వర్గీయులు మండిపడ్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీసీ నేతలంతా ఏకతాటిపైకి వస్తున్నారు. మధుపై ఒత్తిడి పెంచుతూ ఎన్నికల ఖర్చుల కోసం విరాళాలు సైతం అందజేస్తున్నారు. దీంతో బలప్రదర్శనకు దిగుతున్న మధు హైకమాండ్​కు చుక్కలు చూపిస్తున్నారు.

నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్​ఇవ్వడంతో పెద్ద శంకరంపేటకు చెందిన బీసీ లీడర్ విగ్రహం శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహంతో ఉన్నారు. కొద్దిరోజులుగా బలప్రదర్శనకు దిగుతున్న శ్రీనివాస్​గౌడ్​పార్టీ మారే అవకాశం ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు.