16 మందితో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

16 మందితో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను రిలీజ్ చేసింది కాంగ్రెస్. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి. నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ, చెన్నూరు నుంచి జి.వివేక్ వెంకటస్వామి పోటీ చేయనున్నారు. వనపర్తి భోథ్ అభ్యర్థులను మార్చింది కాంగ్రెస్.  భోథ్ లో వన్నెల అశోక్ స్థానంలో ఆదె గజేందర్ కు కేటాయించింది. వనపర్తిలో చెన్నారెడ్డి స్థానంలో  మేఘారెడ్డికి కేటాయించింది. 

పొత్తులో భాగంగా  కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించింది. మొత్తం ఇప్పటి వరకు కాంగ్రెస్ 114 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్  స్థానాలను  పెండింగ్ పెట్టింది.  కాంగ్రెస్  కొడంగల్ కామారెడ్డి రెండు చోట్ల రేవంత్ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్  పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 

థర్డ్ లిస్టులో అభ్యర్థులు

 • చెన్నూరు: జి. వివేక్ వెంకటస్వామి
 • కామారెడ్డి: రేవంత్ రెడ్డి
 • బాన్సువాడ: ఏనుగు రవీందర్
 • నిజామాబాద్ : షబ్బీర్ అలీ
 • డోర్నకల్ : రామచంద్రు నాయక్
 • వైరా : రాందాస్
 • ఇల్లందు: కోరం కనకయ్య
 • సత్తుపల్లి: మట్టా రాగమయి
 • అశ్వరావుపేట: ఆదినారాయణ
 • వనపర్తి: మేఘారెడ్డి
 • బోథ్: గజేందర్
 • జుక్కల్: తోట లక్ష్మీకాంతరావు
 • కరీంనగర్: పరుమళ్ల శ్రీనివాస్
 • సిరిసిల్ల: మహేందర్ రెడ్డి
 • నారాయణఖేడ్: సురేష్ షెట్కార్,
 • పఠాన్ చెరు: నీలం మధు