
తెలంగాణ కాంగ్రెస్ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తమ అభ్యర్థి టీఆర్ఎస్ నాయకులను కలిసినట్లు ఓ వీడియో రిలీజ్ చేసి ప్రచారం చేస్తున్నారన్నారు. పోలింగ్ ముగిసే లోపు తప్పుడు ప్రచారం చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. ఓటమి భయంతో రఘునందన్ రావు, హరీష్ రావు కలిసి కాంగ్రెస్ పార్టీ పై దుష్ప్రాచారం చేస్తున్నారన్నారు. వీడియో ప్రచారం చేసిన వారిని చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారన్నారు.