ఫిబ్రవరి 19 న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలతో తెలంగాణ నేతల భేటీ

ఫిబ్రవరి 19 న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలతో తెలంగాణ నేతల భేటీ
  •  అటెండ్ ​కానున్న సీఎం, పీసీసీ చీఫ్, రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. జాతీయ స్థాయిలో గత కొన్ని రోజులుగా పార్టీ హైకమాండ్ అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో విడివిడిగా సమావేశం అవుతున్నప్పటికీ.. తెలం గాణ నేతలతో భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. 

ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్​చార్జీ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో ఇటు పార్టీ పనితీరు, అటు ప్రభుత్వ పాలన వ్యవహారంపై చర్చ సాగనుంది. నైనీ బొగ్గు గనుల వ్యవహరంలో ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించడంతో దీనిపై చర్చ సాగే అవకాశం ఉందని తెలుస్తున్నది. 

ఇక ఖాళీ గా ఉన్న రెండు కేబినెట్ బెర్తులపై, ఏప్రిల్​లో రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లపై, పెండింగ్​లో ఉన్న నామినేటెడ్ పదవులపై కూడా ఇందులో చర్చ సాగనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయంపై హైకమాండ్ రాష్ట్ర నేత లను అభినందించనుంది. ఈ నెల 21 నుంచి వికారాబాద్​లో ప్రారంభం కానున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి రాహుల్, ఖర్గే వచ్చే తేదీలు కూడా ఇందులో ఖరారు కానున్నాయి.