రాహుల్ పాదయాత్ర.. కన్యాకుమారికి తరలిన నేతలు

రాహుల్ పాదయాత్ర.. కన్యాకుమారికి తరలిన నేతలు

టీకాంగ్రెస్ నేతలు కన్యాకుమారి వెళ్లారు. బుధవారం భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుండగా.. ఈ యాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్ సహా పలువురు కన్యాకుమారి వెళ్లారు. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి ప్రారంభమై జమ్మూకశ్మీర్ వరకు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా సాగనుంది. రోజుకు 25 కి.మీ. నడిచేలా షెడ్యూల్‌ ‌రూపొందించారు.

వచ్చే నెల 24న తెలంగాణలోకి.. 

అక్టోబర్ 24న జోడో యాత్ర తెలంగాణలోకి ఎంటర్ అవుతుందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలో ఎంటరై, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జుక్కుల్ నియోజకవర్గంలో ముగుస్తుందని చెప్పారు. 4 లోక్‌‌‌‌సభ ,9 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగనుందని పేర్కొన్నారు. 

రూట్ మ్యాప్ లో స్వల్ప మార్పులు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ లో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం 13 రోజుల పాటు జరగాల్సిన యాత్రను మరో రెండు రోజులు పెంచారు. మొత్తం 15 రోజులపాటు రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర జరుగుతుంది.