సాగులో సరికొత్త రికార్డులు..వరి పంటలో పంజాబ్ ను దాటేసిన తెలంగాణ

సాగులో సరికొత్త రికార్డులు..వరి పంటలో పంజాబ్ ను దాటేసిన తెలంగాణ

హైదరాబాద్: సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూల్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రంలో వ్యవసాయం ఏటేటా వర్ధిల్లుతోంది. గడిచిన రెండేండ్లలో తెలంగాణ దేశమందరి దృష్టిని ఆకర్షించేలా పంటల సాగులో కొత్త రికార్డులు నెల కొల్పింది. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్ ను దాటేసింది. రాష్ట్ర స్థూల ఉత్స త్తి విలువలో వ్యవసాయం వాటా 6.7 శాతం పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాటా గతేడాది రూ. 1,00,004 కోట్లు నమోదనగా 2024-25 అంచనాల ప్రకారం రూ. 1,06,708కు చేరింది. సర్కారు అంది స్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. అంతకంత కు రైతులకు ఆర్థిక భద్రత చేకూరింది.

2023-24 సీజన్ లో 209.62 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగు చేయగా 296 17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది 2024-25సీజన్ లో సాగు విస్తీర్ణం ఏకంగా 220.77 లక్షలకు పెరిగింది దిగుబడి 320.62 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. తెలంగాణ లో ప్రధాన పంటైన వరి 2023-24లో 118.11 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. 2024-25లో అది 127.03 లక్షల ఎకరాలకు పెరిగింది. దాన్యం దిగుబడి 260.88 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి. ఈ ఏడాది వానాకాలం, యాసంగిలో కలిపి 284 16 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచింది. పత్తి సాగు విస్తీర్ణం ఇంచుమించుగా రెండేండ్లు ఒకే తీరుగా ఉంది. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది పత్తి కప్పాల ఉత్పత్తి 3.89 లక్షల టన్నులు పెరిగింది. 26.35 లక్షల టన్నుల నుంచి 30.24 లక్షల టన్నులకు చేరింది.

రైతుల మేలుకోరే పథకాలు

తొలి రెండేండ్లలోనే ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రా ధాన్యమిచ్చింది. రైతుల మేలుకోరే పథకాలకు భారీ బడ్జెట్ కేటాయిం చింది. తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలనే సంకల్పంతో రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసింది. రూ. 54,280 కోట్లతో వివిధ పథకా లను అమలు చేసింది. దేశంలోనే వరిసాగు విస్తీర్ణంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుం ది. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను అదుకునేం దుకు ప్రభుత్వం వెనుకాడలేదు. గత ఏడాది మార్చి, సెప్టెంబర్లో వడగం డ్లు. వర్షాలతో నష్టపోయిన 94462 మంది రైతులకు రూ. 95.39 కోట్ల పరిహారం అందించింది. ఇటీవల మార్చి, ఏప్రిల్లో వచ్చిన భారీ వర్షా లకు నష్టపోయిన 36449 మంది రైతులకు రూ.44,19కోట్ల పరిహారం అందించింది.

►ALSO READ | పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో మరో పిటిషన్