
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు సర్వీసును పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31న రామకృష్ణారావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. ఆయన సర్వీసును పొడిగించాలని డీవోపీటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మరో 7 నెలలు ఆయన సర్వీసును పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వచ్చే ఏడాది మార్చి వరకు రామకృష్ణారావు తెలంగాణ సీఎస్‌గా కొనసాగనున్నారు. ఈ ఏడాది మేలో ఆయన సీఎస్‌గా నియమితులయ్యారు.
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. యంత్రాగాన్ని గాడిలో పెట్టడం, ఇతర సీనియర్ఐఏఎస్లతోనూ సమన్వయం చేసుకుంటూ పనిచేయడం, గత ప్రభుత్వ రుణాలను షెడ్యూల్ చేయించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును మరో ఏడు నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. కేంద్రం కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకున్నది.