రాష్ట్రంలో 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం -

రాష్ట్రంలో 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం -

హైదరాబాద్ : రాష్ట్రంలో  కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ప్రమాదంలో ఉన్న 19,071 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.   రాష్ట్రంలో వరదలు, పునరావాస చర్యలపై సోమేశ్‌కుమార్‌ గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వల్ల పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఏవిధమైన భారీ నష్టం జరగలేదని  తెలిపారు. ప్రధానంగా గోదావరీ నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలిపారు.  ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న వందలాది మందిని కాపాడనట్లుగా ఆయన  చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 16 మందిని రక్షించాయని, మరో ఇద్దరిని వైమానికదళం రక్షించిందని  సోమేశ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో 223 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 19,071 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. భద్రాచలం జిల్లాలో 43 శిబిరాలలో 6318 మందికి, ములుగు జిల్లాలో 33 క్యాంప్ లలో 4049 మందికి భూపాలపల్లి జిల్లాలో 20 క్యాంప్ లలో 1226 మందికి ఆశ్రయం కల్పించినట్లుగా సోమేశ్ కుమార్ వివరించారు.