ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లపై రెండు మూడ్రోజుల్లో గైడ్‌లైన్స్‌

ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లపై రెండు మూడ్రోజుల్లో గైడ్‌లైన్స్‌

హైదరాబాద్, వెలుగు: టీచర్లు, ఎంప్లాయీస్‌‌‌‌ నుంచి ఆప్షన్లు తీసుకుని, వారిని సొంత జిల్లాలకు పర్మనెంట్‌‌‌‌గా పంపించే ప్రక్రియను నెలాఖరులోగా పూర్తిచేస్తామని సీఎస్ సోమేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో గైడ్‌‌‌‌లైన్స్ రిలీజ్ చేస్తామన్నారు. కొత్త జిల్లాల ప్రకారం టీచర్లను అలాట్ చేయాలని, ప్రమోషన్లు, ట్రాన్స్‌‌‌‌ఫర్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్‌‌‌‌ రెడ్డి, కమలాకర్‌‌‌‌‌‌‌‌ రావు కోరారు. ఈ మేరకు సీఎస్‌‌‌‌ను సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. వీరి విజ్ఞప్తికి సీఎస్ స్పందించారు. ఎంప్లాయీస్‌‌‌‌ను సొంత జిల్లాలకు కేటాయించే ప్రక్రియ పూర్తయిన తరువాత కొత్త జిల్లాల్లో సీనియార్టీ ప్రకారం మేనేజ్‌‌‌‌మెంట్ల వారీగా ప్రమోషన్లు, ట్రాన్స్‌‌‌‌ఫర్ల షెడ్యూల్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. టీచర్ల రేషనలైజేషన్‌‌‌‌ కూడా చేస్తామని సీఎస్ చెప్పినట్టు పీఆర్టీయూ నేతలు తెలిపారు.