హైదరాబాద్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ‘X’ అకౌంట్ హ్యాక్ అయింది. మే నెల 22న సైబర్ నేరగాళ్లు ఈ అకౌంట్ను హ్యాక్ చేశారు. హ్యాకింగ్ జరిగి 20 రోజులు అవుతున్నా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు గుర్తించకపోవడం కొసమెరుపు. ఒకప్పుడు దేశంలో నంబర్ 1 సైబర్ సెక్యూరిటీ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
