జులై 1 నుంచి డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ

జులై 1 నుంచి డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ

డిగ్రీ విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి దోస్త్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.లింబాద్రి విడుదల చేశారు. మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయన షెడ్యూల్ ప్రకటించారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా ఇంటర్ ఫలితాలు రిలీజైన వెంటనే దోస్త్ నోటిఫికేషన్ విడదల చేసినట్లు లింబాద్రి చెప్పారు. 

దోస్త్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ జూలై 1 నుంచి 30వరకు కొనసాగనుంది. జూలై 6 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ లు ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 6న ఫేజ్ 1 సీట్లు కేటాయింపు జరగనుంది. ఆగస్టు 7 నుంచి 21 వరకు సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆగస్టు 7 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆగస్టు 27న సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్ మెంట్ జరగనుంది. మూడో దశ వెబ్ ఆప్షన్లకు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 16న సీట్ల అలాట్మెంట్ జరగనుంది. అక్టోబర్1 నుంచి డిగ్రీ రెగ్యులర్ క్లాసులు ప్రారంభంకానున్నాయి.