
సంగారెడ్డి జిల్లా: లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర DGP మహేందర్ రెడ్డి. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో లాక్ డౌన్ పరిస్థితిని పరిశీలించారు డీజీపీ. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్ర సరిహద్దులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఈపాస్ లు, ఇతర రాష్ట్రాల ఈ పాసులు ఉన్నా రాష్ట్ర సరిహద్దులోకి అనుమతి ఇస్తున్నామన్నారు. రోడ్లపైకి రాకుండా 100% లాక్ డౌన్ అమలు చేసేందుకు ప్రజలు సహరించాలని.. అన్ని జిల్లాల్లో, పోలీస్ కమిషనరేట్ లలో, అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలిస్ అధికారులకు కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలని సూచించామన్నారు. పారిశ్రామిక వాడలోని ఫార్మా పరిశ్రమ అవసరాలను గుర్తించి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇతర పరిశ్రమల వారు లాక్ డౌన్ సడలించిన 4 గంటల్లో వారి పనులు చక్కబెట్టుకోవాలని సూచించారు డీజీపీ మహేందర్ రెడ్డి.