తెలంగాణ డీజీపీ జితేంద‌ర్‌ ఇంట తీవ్ర విషాదం..

తెలంగాణ డీజీపీ జితేంద‌ర్‌ ఇంట తీవ్ర విషాదం..

 తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. డీజీపీకి మాతృవియోగం క‌లిగింది. జితేంద‌ర్ త‌ల్లి కృష్ణ గోయ‌ల్‌(85) శుక్రవారం (ఆగస్టు 15)  ఉద‌యం క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న కృష్ణ గోయ‌ల్..  హైద‌రాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

డీజీపీ జితేందర్ మాతృమూర్తి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపాన్ని తెలియజేశారు. వారి తల్లి మరణం ఆ కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఆ మాతృమూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

డీజీపీ తల్లి కృష్ణ గోయ‌ల్ మృతిప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సంతాపం ప్రకటించారు.

►ALSO READ | వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బస్సు, కంటైనర్ లారీ ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు