వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బస్సు, కంటైనర్ లారీ ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు

వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బస్సు, కంటైనర్ లారీ ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు

వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది.  ఆర్టీసీ బస్సు, కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బస్సు ఎడమవైపు ముందు భాగం.. లారీ కుడివైపు ముందు భాగం ఢీకొన్నాయి. రాయపర్తి మండలం మైలారం దగ్గర జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

ఆర్టీసీ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పదిమందికి గాయాలయ్యాయి. వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

మైలారం దగ్గర వెళ్తున్న బస్సును వేగంగా రోడ్డు ఎక్కబోయిన లారీ ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయపడ్డారు. ప్రాణనష్టం లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.