డిగ్రీ అర్హతతో DCCBలో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హతతో DCCBలో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..

డిస్ట్రిక్ కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ) రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 06. 

  • పోస్టుల సంఖ్య: 225 (స్టాఫ్ అసిస్టెంట్). 
  • పోస్టులు: హైదరాబాద్ 32, కరీంనగర్ 43, ఖమ్మం 99, మహబూబ్ నగర్ 09, మెదక్ 21, వరంగల్ 21. 
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • స్కిల్: తెలుగు భాషలో ప్రావీణ్యం (అప్లై చేసే అభ్యర్థులు పదో తరగతి లోపు తెలుగు సబ్జెక్టుగా చదివి) ఉండాలి. అపాయింట్​మెంట్ సమయంలో సంబంధిత డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ భాష రాయడం, చదవడం, మాట్లాడటంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. 
  • వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. లేదా 1995, అక్టోబర్ 02 కంటే ముందు గానీ 2007, అక్టోబర్ 01 తర్వాత గానీ జన్మించిన వారై ఉండరాదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • లాస్ట్ డేట్: నవంబర్ 06. 
  • అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్  రూ.500. జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.1000. 
  • సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • పూర్తి వివరాలకు tgcab.bank.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.

ఎగ్జామ్ ప్యాటర్న్

  • ఆన్​లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 160 ప్రశ్నలు 160 మార్కులకు అడుగుతారు. 120 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. 
  • మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్–1ఏలో జనరల్/ ఫైనాన్షియల్ అవేర్​నెస్ 30 ప్రశ్నలు 30 మార్కులకు,సెక్షన్–1బీలో అవేర్​నెస్ ఆన్ క్రెడిట్ కో–ఆపరేటీవ్స్ 10 ప్రశ్నలు 10 మార్కులకు (20 నిమిషాలు),  సెక్షన్–2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు (30 నిమిషాలు),  సెక్షన్–3లో రీజనింగ్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 40 మార్కులకు (35 నిమిషాలు), సెక్షన్–4లో న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 40 మార్కులకు (35 నిమిషాలు) అడుగుతారు. ప్రతి సెక్షన్ కు వేర్వేరు సమయం ఉంటుంది.