హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై అక్టోబర్ నెలాఖరులోగా సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పనితీరు, వర్షాభావ పరిస్థితులపై మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో పలు ప్రాంతాల్లో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులను అధికారులు సీఎస్‌కు వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని పక్కా గణాంకాలతో నివేదిక రూపొందించాలని సీఎస్ సూచించారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 320 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
