తెలంగాణలో టీచర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డీఎస్సీ ఎగ్జామ్.. నవంబర్ 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. 11 జిల్లాల్లో సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు గతంలోనే ప్రకటించింది విద్యాశాఖ.
అయితే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది..నవంబర్ 30వ తేదీన పోలింగ్ అంటూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్ష వాయిదా పడే అవకాశముందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. .
- ALSO READ | పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
ఇక.. పరీక్షలో ప్రశ్నలు తెలుగు-ఆంగ్లం, ఉర్దూ-ఆంగ్లంలో ఉంటాయి. 160 ప్రశ్నలు... 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. టెట్‌లో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇచ్చారు. రెండింటినీ కలిపి తుది ర్యాంకు నిర్ణయిస్తారు. రోజుకు రెండు విడతల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. తొలుత ఎస్జీటీ అభ్యర్థులకు ఉంటాయి. ఈసారి 1-7 తరగతుల విద్యాభ్యాసం ఆధారంగా స్థానిక, స్థానికేతర అభ్యర్థిగా నిర్ణయిస్తారు. 95 శాతం ఖాళీలను స్థానికులతో.. 5 శాతాన్ని స్థానికేతరులతో భర్తీ చేస్తారు.
