తెలంగాణలో ఎడ్ సెట్ దరఖాస్తు గడువు 20 వరకు పెంపు

తెలంగాణలో ఎడ్ సెట్ దరఖాస్తు గడువు 20 వరకు పెంపు

హైదరాబాద్, వెలుగు: బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (టీజీ ఎడ్ సెట్) దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకూ పొడగిస్తున్నట్టు సెట్ కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. ఫైన్ లేకుండా దరఖాస్తు గడువు మంగళవారంతో ముగియనుండగా, అభ్యర్థుల విజ్ఞప్తితో మరో వారం పాటు గడువు పెంచారు.

ఎడ్ సెట్ కు ఇప్పటిదాకా 32,794 మంది అప్లై చేశారు. జూన్ 1న రెండు సెషన్లలో ఎడ్ సెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.  కాగా.. ఇంటర్మీడియేట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కు అటెండ్ కాబోయే విద్యార్థులు కూడా రూ.2500 ఫైన్​తో ఈ నెల 14 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఒక ప్రకటనలో  పేర్కొన్నారు.