హైదరాబాద్: రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించిన టీజీ ఎడ్ సెట్-2026 ఫలితాలు విడుదల అయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి శనివారం (మే 30) ఫలితాలను విడుదల చేశారు. టీజీ ఎడ్ సెట్ అధికారిక వెబ్ సైట్ edcet.tgche.ac.inలో అభ్యర్థులు ర్యాంక్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది ఎడ్ సెట్ పరీక్షకు 29,342 మంది హాజరు కాగా 28,446 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణత శాతం 96.95గా నమోదు అయ్యింది. బానోత్ అజిత్ సాయి కృష్ణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఇద్దరు ట్రాన్స్ జెండర్లు ఎడ్ సెట్లో పాస్ అయ్యారు. త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
►ALSO READ | తెలంగాణ ఓపెన్ ఇంటర్, టెన్త్ ఫలితాలు విడుదల
