
హైదరాబాద్: DSCలో స్పోర్ట్స్ కోటాకింద ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు వారి స్పోర్ట్స్ సర్టిఫికెట్లను ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని తెలంగాణ విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 100 టీచర్ పోస్టులు స్పోర్ట్స్ కోటా భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో స్పోర్ట్స్ కోటా అప్ల య్ చేసి, పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు స్కాన్ చేసి ఆన్ లైన్ ద్వారా సబ్మిట్ చేయాలని విద్యాశాఖ అధికారులు కోరారు.