స్కూళ్ల రిపేర్లకు రూ.500 కోట్లు!..సర్కారుకు ప్రపోజల్స్ పెట్టాలని విద్యాశాఖ నిర్ణయం

స్కూళ్ల రిపేర్లకు  రూ.500 కోట్లు!..సర్కారుకు ప్రపోజల్స్ పెట్టాలని విద్యాశాఖ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో సివిల్ వర్క్స్ కోసం ప్రత్యేకంగా రూ.500 కోట్లు బడ్జెట్​లో అడగాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు యోచిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే ప్రతిపాదనలు పంపించాలని నిర్ణయించారు. ప్రస్తుతం బడుల్లో ఏ చిన్న పని జరగాలన్నా కేంద్రం ఇచ్చే ‘సమగ్ర శిక్ష’ నిధుల వైపే చూడాల్సి వస్తోంది. 

రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ వర్క్స్ కోసం ఇప్పటివరకు ప్రత్యేకంగా నయా పైసా విడుదల కావడం లేదు. దీంతో అత్యవసరమైన రిపేర్లు, టాయిలెట్స్ మెయింటెనెన్స్, క్లాస్ రూమ్ లీకేజీల వంటి పనులు నిలిచిపోతున్నాయి.  ఈ నేపథ్యంలోనే వచ్చే రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో కనీసం రూ.500 కోట్లు కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు.