
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా బడులను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పిల్లలున్న చోట తొలి విడతలో 157 ప్రభుత్వ స్కూళ్లను ఓపెన్ చేయాలని నిర్ణయించింది. 20 మంది కన్నా ఎక్కువగా పిల్లలున్న ప్రాంతాలను గుర్తించి 571 కొత్త బడులను ప్రారంభించే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలో తొలి విడతలో భాగంగా 157 స్కూళ్లను వెంటనే ప్రారంభించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, అడిషనల్ డైరెక్టర్ లింగయ్య.. డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు. ఆయా ప్రాంతాల్లో భవనాలు లేదా, హాస్టళ్లు ఉంటే వాటిలో స్కూళ్లను ప్రారంభించాలని సూచించారు. సర్కారు బిల్డింగులు లేకపోతే ప్రైవేటు అద్దె భవనాలు తీసుకోవాలని తెలిపారు.