రేపటి (మే 11) నుంచి విద్యా వారోత్సవాలు..జిల్లా కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్

రేపటి (మే 11) నుంచి విద్యా వారోత్సవాలు..జిల్లా కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించనున్న విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని సీఎస్ కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో ఆయన విద్యా వారోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎస్​ మాట్లాడుతూ.. ఈ నెల 11న ఎల్‌‌‌‌బీ స్టేడియంలో నిర్వహించనున్న విద్యావారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో  హాజరయ్యేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు.

వారోత్సవాల్లో భాగంగా చేపట్టబోయే రోజువారీ కార్యక్రమాల వివరాలు, విద్యాశాఖ రూపొందించిన యాక్షన్ ప్లాన్‌‌‌‌ను ఉన్నతాధికారులు కలెక్టర్లకు వివరించారు. అందులో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ప్రక్రియ పురోగతి, ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ప్రస్తుత పరిస్థితి, స్వీయ జన గణనకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.