పోలింగ్ విధుల్లో ఉద్యోగి గుండెపోటుతో మృతి

పోలింగ్ విధుల్లో ఉద్యోగి గుండెపోటుతో మృతి

తెలంగాణ ఎన్నికల పోలింగ్ విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి గుండెపోటుతో చనిపోయారు. సుధాకర్ అనే 48 ఏళ్ల వ్యక్తి.. కొండాపూర్ వెంటర్నటీ విభాగంలో అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఈ సమయంలో పోలింగ్ సిబ్బంది విధులు కేటాయించారు ఉన్నతాధికారులు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లోని పోలింగ్ బూత్ నెంబర్ 248లో సుధాకర్ పోలింగ్ సిబ్బందిగా కేటాయించటం జరిగింది. 

పోలింగ్ బూత్ సెంటర్ లో ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో.. 2023, నవంబర్ 30వ తేదీ తెల్లవారుజామున.. గుండెల్లో నొప్పి ఉందంటూ స్పహతప్పి పడిపోయాడు. మిగతా సిబ్బంది వెంటనే.. సమీపంలోని పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు స్పష్టం చేశారు డాక్టర్లు. విషయం కుటుంబ సభ్యులకు తెలియజేసిన అధికారులు.. సుధాకర్ మృతదేహాన్ని వారికి అప్పగించారు. పోలింగ్ విధుల్లో ఉద్యోగి మరణంతో.. మిగతా సిబ్బంది కన్నీటి పర్యంతం అయ్యారు.