బీఆరెస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి కుంభం

బీఆరెస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి కుంభం

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన యాదాద్రి -భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంతగూటికి చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో  కుంభం అనిల్ కుమార్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని కుంభం నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి...ఆయన్ను తిరిగి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. దీంతో  కుంభం అనిల్ కుమార్ రెడ్డి సొంతగూటికి వెళ్లారు. 

 
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో విభేదాల వల్ల  అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్  ను వీడారు. 2023 జూలై 24న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అనిల్ కుమార్‌తో పాటు ఆయన ముఖ్య అనుచరులు  కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. 

Also Read :- బటానిల్లాగా గ్రూప్ 1 పేపర్లను అమ్ముకున్నరు

ఆగస్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో  భువనగిరి నియోజకవర్గం అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికే మరోమారు అవకాశం ఇచ్చారు కేసీఆర్.  దీంతో కుంభం అనిల్ తీవ్ర అసంతృప్తి చెందారు. ఈ క్రమంలోనే  కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగింది. దీనికి తోడు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారు.  అయితే ఆ ప్రచారాన్ని ఖండించినా... తాజాగా తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.