తెలంగాణలో అమృత్ 2 కోసం స్టేట్ లెవల్ కమిటీ ఏర్పాటు

తెలంగాణలో అమృత్ 2 కోసం స్టేట్ లెవల్ కమిటీ ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అమృత్ 2.0 స్కీమ్ కింద చేపట్టే పనుల కోసం స్టేట్ లెవల్​లో డబ్ల్యూ ఆర్ ఆర్ సీ ( వాటర్ రిసోర్స్ రికవర్ సెల్ ) కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ రామకృష్ణ రావు జీవో జారీ చేశారు. హైదరాబాద్ సీడీఎంఏ  చైర్మన్​గా వ్యవహరించనున్న ఈ కమిటీలో మరో 8 మంది అధికారులు ఉండనున్నారు. 

మున్సిపల్ శాఖ డిప్యూటీ సెక్రటరీ, వాటర్ బోర్డు ఎండీ, పవర్, ఇండస్ర్టీస్ ,  ఇరిగేషన్ లేదా అగ్రికల్చర్ శాఖ నుంచి ఓ అధికారి, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఈఎన్సీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ( పీసీబీ) నుంచి ఓ అధికారి, అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్ మెంబర్లుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.