కొత్త కోర్సుల దరఖాస్తులకు గడువు మార్చి 23 వరకు పెంపు..డిగ్రీ కాలేజీలకు మరో ఛాన్స్ 

కొత్త కోర్సుల దరఖాస్తులకు గడువు మార్చి 23 వరకు పెంపు..డిగ్రీ కాలేజీలకు మరో ఛాన్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో కొత్త కోర్సుల దరఖాస్తులకు గడువు ఈనెల 23 వరకు పెంచినట్లు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్త యూజీ, పీజీ కోర్సుల మంజూరుతోపాటు ప్రస్తుతం ఉన్న కోర్సుల మార్పులు, మీడియం మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు ఉపాధి కల్పించేలా 11 కొత్త  కోర్సులను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి టెక్ కోర్సులతోపాటు డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మారిటైమ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ వంటి డిఫరెంట్ కోర్సులను కూడా జాబితాలో చేర్చినట్లు వివరించారు. పీజీ స్థాయిలోనూ అడ్వాన్స్డ్ డిఫెన్స్ స్టడీస్, క్లైమేట్ సైన్స్, మెడికల్ ఇమ్యునాలజీ వంటి కొత్త కోర్సులకు కాలేజీలు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.