హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 27 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (ప్యాక్స్) ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జి కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా, మరో 7 ప్యాక్స్ లకు పర్సన్-ఇన్-చార్జి కమిటీలను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సహకార సంఘాల చట్టం ప్రకారం.. ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించేవరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు (ఈ రెండింటిలో ఏది ముందైతే అది వర్తించేలా) ఆరు నెలల కాలపరిమితితో ఈ కమిటీలను నియమించారు.
యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట, ఆత్మకూరు, రేణికుంట, ఆలేరు, బొమ్మలరామారం, తుర్కపల్లి, గుండాల ప్యాక్స్లకు ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జి కమిటీలను ప్రభుత్వం కొత్తగా నియమించింది. ఈ కమిటీలు వెంటనే బాధ్యతలు స్వీకరించి, ఆయా సహకార సంఘాల నిర్వహణను పర్యవేక్షించనున్నాయి.
