ఎంజాయ్ : 17న రెండు పండగలు.. ఫుల్ హాలిడే

ఎంజాయ్ : 17న రెండు పండగలు.. ఫుల్ హాలిడే

రెండు పండగలు ఒకేసారి వచ్చాయి.. 2024, జూలై 17వ తేదీ బుధవారం హిందూవుల తొలి ఏకాదశి.. అంతే కాదు ముస్లింల మొహర్రం.. ఈ రెండు పండుగల ఒకే రోజు రావటంతో.. హాలిడే ప్రకటించింది ప్రభుత్వం. 17వ తేదీ స్కూల్స్ అన్నింటికీ సెలవు.   ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం ముహర్రం జూలై 7, 2024 నుండి ప్రారంభమవుతుంది. అషురా జరుపుకునే తేదీ జూలై 17...జులై 6న నెలవంక కనిపించినట్లయితే, ముహర్రం 9వ తేదీ ....  అషురా జులై 15... 16 తేదీలలో జరుపుకుంటారు. లేకుంటే జులై 16, 17 తేదీల్లో పాటిస్తారు.

ALSO READ | హిందువుల తొలి పండుగ ఏదో తెలుసా..

ఇది ఇస్లామిక్ క్యాలెండర్‌లో మొదటి నెల. ఈ మాసంలో షియా ముస్లింలు సంతాపం తెలుపుతారు.మొహర్రం... అంటే, అషురా, షియా ముస్లింలకు సంతాప దినం, ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త మనవడు హుసేన్ ఇబ్న్ అలీ అతని బంధువులతో కలిసి అమరుడయిన రోజని ముస్లిం మత పెద్దలు చెబుతుంటారు. ఈ రోజు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

తొలి ఏకాదశి

రేపు బుధవారం(జులై 17).. తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశి.. తొలి ఏకాదశి పండుగ.. హిందువులకు ఎంతో పవిత్రమైన రోజు.. అంతేకాదు, హిందువులకు తొలి పండుగను ఈ రోజునే జరుపుకుంటారు. దీనినే దేవశయని ఏకాదశి అనికూడా అంటారు. ఆరోజు భక్తులు విష్ణుమూర్తిని పూజించి దేవాలయాలను సందర్శిస్తారు. ఉపవాస వ్రతం పాటించి ఎంతో భక్తి శ్రద్దలతో భగవాన్మామస్మరణ చేస్తారు. పేలాల పిండిని తయారు చేసి స్వామికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకుంటారు.

ALSO READ | Guru Purnima2024 :గురు పౌర్ణమి ఎప్పుడు..  జులై 20 నా..  21నా..  క్లారిటి ఇచ్చిన పండితులు