అధికారికంగా కాకా జయంతి, వర్ధంతి

అధికారికంగా కాకా జయంతి, వర్ధంతి

హైదరాబాద్, వెలుగు: నిరుపేదలు, కార్మికుల సంక్షేమం కోసం జీవితాంతం పాటుపడిన గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

 అక్టోబర్ 5న కాకా జయంతి, డిసెంబర్ 22న వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కాకా జయంతి, వర్ధంతి నిర్వహణకు ఏర్పాట్లు చూసుకోవాలని యూత్ అడ్వాన్స్​మెంట్ అండ్ కల్చర్ డిపార్ట్‎మెంట్​కు సూచించారు.