ఈహెచ్ఎస్ కోసం ట్రెజరీలకు వెళ్లక్కర్లేదు..పెన్షనర్లకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌‌‌లోని పాత డేటానే వాడుకోవాలని నిర్ణయం

ఈహెచ్ఎస్ కోసం ట్రెజరీలకు వెళ్లక్కర్లేదు..పెన్షనర్లకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌‌‌‌లోని పాత డేటానే వాడుకోవాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌‌‌‌ఎస్) కోసం వ్యక్తిగత వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌‌‌‌లో నమోదు చేయాలన్న నిబంధనను సవరించింది. పెన్షనర్లు ట్రెజరీ ఆఫీసులకు వచ్చి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

  ప్రస్తుతం రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వద్ద అందుబాటులో ఉన్న పాత డేటానే వాడుకోవాలని సర్కారు నిర్ణయించిందన్నారు. ఇందులో ఏవైనా మార్పులు చేయాల్సి ఉంటే పెన్షనర్లు సంబంధిత ట్రెజరీ ఆఫీసర్ లేదా పెన్షన్ పేమెంట్ ఆఫీసర్‌‌‌‌ను సంప్రదించాలన్నారు. ప్రభుత్వానికి ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌‌‌‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.