మోడల్ స్కూళ్లలో ఔట్‌‌సోర్సింగ్ టీచర్ల సేవలు పొడిగించిన సర్కార్...

మోడల్ స్కూళ్లలో ఔట్‌‌సోర్సింగ్ టీచర్ల సేవలు పొడిగించిన సర్కార్...

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఔట్‌‌సోర్సింగ్, హవర్లీ బేస్డ్ టీచర్ల సేవలను ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ 3,952 మంది ఉద్యోగుల సేవల కొనసాగింపునకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. వీరిలో 2,716 మంది ఔట్‌‌సోర్సింగ్ ఉద్యోగులు, 1,236 మంది హవర్లీ బేస్డ్ టీచర్లున్నారు.

ప్రస్తుతం మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఈ ఉద్యోగులంతా జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, వారి సేవలను ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు కొనసాగించాలని, ప్రతినెలా జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.  ఈ నిర్ణయంపై హవర్లీ బేస్డ్ టీచర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  నాగరాజు హర్షం వ్యక్తం చేశారు.