దళితులకు మూడెకరాలు ఇయ్యలేకే 10 లక్షలు ఇస్తున్నం

దళితులకు మూడెకరాలు ఇయ్యలేకే 10 లక్షలు ఇస్తున్నం
  • భూమి దొరకడం లేదు.. అమ్మేటోళ్లు లేరు
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 

హనుమకొండ: దళితులకు మూడెకరాలు ఇయ్యలేకే 10 లక్షలు ఇస్తున్నం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. దళితులకు మూడెకారల  భూమి ఇస్తే బాగుంటుందని  కేసీఆర్ ఆలోచించారు కానీ  భూమి దొరకడం లేదు, 10 లక్షలు, 20 లక్షలు ఖర్చుపెట్టి కొందామన్నా అమ్మెటోళ్లు లేరని ఆయన వివరించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఎస్సీలకే పరిమితం కాదు.. పేద వర్గాలను పైకి తీసుకురావాలని, సమాజంలో అందరూ సమానంగా ఉండాలని కోరుకున్న మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. మనుష్యుల మద్య తారతమ్యాలను రూపుమాపాడని వివరించారు. 
ఉన్నోళ్లుకు సాయం చేస్తే మర్చిపోతారు కానీ పేదలకు సాయం చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.  నీళ్లొచ్చాక బలవతంగా తీసుకొనే పరిస్థితి లేదు, బలవంతంగా గుంజుకునే పరిస్థితి లేదు, భూమి ఇవ్వకపోతే  రియాక్షన్ వస్తోందని, అందుకే 3 ఎకరాల భూమి  పథకం తీసేసి వేరే పథకం పెట్టాలని చాలా మంది సీఎం దగ్గర ఒత్తిడి చేశారని తెలిపారు. 
దళితులకు 3 ఎకరాల స్కీమ్ ఉంటుంది, అది తీసెయ్యకుంటే ఊర్లలో అమ్మెటోళ్లు ఉంటే కొని ఇవ్వచొచ్చు అన్నారు. దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి 10 లక్షలు ఇస్తామని క్యాబినెట్ మీటింగ్ లో చెప్పారని తెలిపారు. 10 లక్షలు చేతికి ఇచ్చే ముచ్చట కాదు,  ఏం చేస్తారు,  ఏం కొనుక్కుంటారు ? ఏ బిజినెస్ చేస్తారో చెబితేనే చెక్కు అందిస్తాం, ఇతర పథకాల్లో సబ్సిడీ వస్తుంది కాబట్టి ఈ డబ్బులు సొంత పెట్టుబడిగా వాడుకోవాలని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. 10 వేల కోట్లతో రాష్ట్రంలోని దళిత వాడల అభివృద్ధి చేస్తామన్నారు. దళిత ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే దళిత బంధు పథకం ఉద్దేశమన్నారు. అంబేద్కర్ ఆశయాలు సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. అంబేడ్కర్  అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడని కొనియాడారు.