
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు స్పోర్ట్స్ సూట్, షూస్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రారంభించారు. సమగ్ర శిక్ష పీఏబీలోను దీనికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీనికి అయ్యే ఖర్చులో 60శాతం కేంద్రం ఇవ్వనున్నది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షమందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది.