భూముల విలువ పెంపుకు సర్కార్ ఓకే

భూముల విలువ పెంపుకు సర్కార్ ఓకే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి అనుమతిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2013 ఆగస్టు 1న అమల్లోకి వచ్చిన భూముల విలువలే ఇప్పటికీ అమలవుతున్నాయని, ఎనిమిదేళ్లుగా ఇవే ధరలు ఉన్నందున మార్చాల్సిన అవసరం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవ్వడం, ఐటీ, ఫార్మా, టూరిజం అభివృద్ధితో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు, రీజినల్ రింగ్ రోడ్డు ప్రపోజల్ తో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూములకు డిమాండ్ పెరిగిందని తెలిపింది. అందుకు అనుగుణంగా భూముల విలువను పెంచాలంది. ఇందుకోసం సెంట్రల్ వాల్యూయేషన్ అడ్వైజరీ కమిటీని నియమించాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రిని సీఎస్ సోమేశ్​కుమార్  ఆదేశించారు.