ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ రద్దు

ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ రద్దు

రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు చేసింది సర్కార్. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్స్ రద్దు చేసినట్లు తెలిపింది. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా పిల్లలపై ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో... వైరస్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు రద్దు చేశామంటున్నారు అధికారులు. మరోవైపు ఇప్పటికే ఇంటర్ ఫస్ట్ ఇయర్, టెన్త్ ఎగ్జామ్స్ ను క్యాన్సల్ చేసింది ప్రభుత్వం. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఫలితాల ఆధారంగా సెకండియర్ ఫలితాలు ఇవ్వనుంది. అలాగే బ్యాక్ లాక్ ఉన్న వారికి మినిమమ్ మార్కులతో పాస్ చేయనుంది.