మద్యం టెండర్లకు భారీగా దరఖాస్తులు.. కేసీఆర్​ సర్కార్​కు కాసుల వర్షం

మద్యం టెండర్లకు భారీగా దరఖాస్తులు.. కేసీఆర్​ సర్కార్​కు కాసుల వర్షం

తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల (2023–25)కు వేల సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. ఎన్నికల ఏడాది కావడం.. మద్యానికి గిరాకీ బాగుంటుందనే కారణాలతో టెండర్లు వేయడానికి వేల సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఆగస్టు 11 నాటికి దాదాపు 7వేల మంది టెండర్లు దక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు.  

రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో టెండర్లకు పోటీ ఎక్కువగా ఉంది.  రాష్ట్రంలో మొత్తం 2వేల 620 వైన్​ షాపులున్నాయి. టెండర్లు వేయడంలో బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉన్నారని టాక్​ వినిపిస్తోంది.  

ఒక్కో అప్లికేషన్​కు నాన్​రిఫండబుల్​ ఫీజు కింద రూ.2 లక్షలు కట్టించుకుంటున్నారు. ఈ ఫీజు ద్వారా ఇప్పటి దాకా సర్కారుకు వచ్చిన ఆదాయమే రూ.వెయ్యి కోట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న వైన్​ షాపుల గడువు నవంబర్​ 30తో ముగియబోతోంది. 

అప్లికేషన్లు, ఎక్సైజ్​ డ్యూటీతో రూ.2వేల కోట్లు రాబట్టాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.