హైదరాబాద్: మహాలక్ష్మి గ్యాస్ పథకం లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ నెంబర్ లేదా ఆధార్ అథెంటికేషన్ సమర్పించాలని లబ్దిదారులను ఆదేశించింది.
లబ్దిదారుల వివరాల ధ్రువీకరణకు రేషన్ కార్డు, ఆధార్, ఎల్పీజీ కనెక్షన్ వివరాలను అనుసంధానం చేయాలని తెలిపింది. ఆధార్ లేని వారికి పాన్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డుతో గుర్తింపు ధ్రువీకరణకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం గుర్తుచేసింది. వేలిముద్రలు పడని వారికి ఐరిస్, ఫేస్ అథెంటికేషన్‌తో పాటు ఓటీపీ, క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరణ చేసుకునే వెసులుబాటు ఇచ్చినట్లు తెలిపింది.
మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌లో దాదాపు 43 లక్షల మంది అర్హులు లబ్దిపొందుతున్నారు. మొత్తం సిలిండర్ ధర ముందే చెల్లించాల్సి ఉంటుంది. అందులో రూ.500 సిలిండర్‌కు పోను మిగిలిన అమౌంట్ లబ్ధిదారు ఖాతాలో జమ అవుతుంది. రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు 11.58 లక్షల మంది ఉన్నారు. వీరంతా మహాలక్ష్మి స్కీమ్ పరిధిలోకి వస్తారు.
