రేపు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

రేపు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు రేపు(శుక్రవారం) విడుదల కానున్నాయి. శుక్ర‌వారం విడుదల కానున్నఫ‌లితాల్లో FA-1 మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించ‌నున్న‌ట్లు విద్యాశాఖ ప్ర‌క‌టించింది. పదో తరగతి ఫలితాల రిలీజ్ కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గ్రీన్ సిగ్నలిచ్చారు.

ఇప్పటికే కరోనా ప్రభావం రెండు అకాడమిక్‌ ఇయర్స్‌పై ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థలు పరీక్షలను రద్దు చేస్తూ. మరికొన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. గతేడాదిలానే ఈసారి కూడా ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్స్‌ ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. 5.21 లక్షల మంది విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రకటించారు.

పరీక్షా ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు అధికారులు. శుక్రవారం ఫలితాల విడుదలలో ఏమైనా ఆలస్యం జరిగితే.. వెంటనే మరుసటిరోజు అంటే శనివారం ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.