
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్అభివృద్దికి, సమస్యల పరిష్కారానికి, మెడికల్ కాలేజీ స్టూడెంట్లహాస్టల్ బిల్డింగ్ నిర్మాణానికి రూ.66 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, హెల్త్మినిస్టర్దామోదర రాజనర్సింహకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రాజారావు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం టీజీఎంఎస్ఐడీసీ ఎండీగా చార్జ్తీసుకున్న ఐఏఎస్ ఆఫీసర్హేమంత్ను కలిసిన సూపరింటెండెంట్అభినందనలు తెలిపారు.
గాంధీలో డ్రైనేజీ పనులకు రూ 15.5 కోట్లు, ఎలక్ట్రికల్ పనులకు రూ రూ.12 కోట్లు, ఫైర్‌ఫైటింగ్ సిస్టమ్ వర్క్స్‌కు రూ3.5 కోట్లు, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ ఫ్లాంటేషన్ సెంటర్ పనులకు రూ.35 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ పనులన్నీ టీజీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. త్వరితగతిన పూర్తిచేయాలని తాము చేసిన విజ్ఞప్తికి టీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ సానుకూలంగా స్పందించారని రాజారావు వివరించారు.