
హైదరాబాద్, వెలుగు: గృహ జ్యోతి పథకం కింద లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,900.87 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
2025–26 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులను డిస్కంలకు సబ్సిడీ రూపంలో అందజేయనున్నారు. మొత్తం రూ.2,080.38 కోట్ల బడ్జెట్‌లో భాగంగా, ఏప్రిల్ 2025 కోసం ఇప్పటికే రూ.179.51 కోట్లు మంజూరు చేయగా, మిగిలిన రూ.1,900.87 కోట్లను తాజాగా విడుదల చేశారు.