ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ.4 వేల కోట్లు సాంక్షన్

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు రూ.4 వేల కోట్లు సాంక్షన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిర్మించబోయే 20 యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  స్కూళ్లకు ప్రభుత్వం రూ.4 వేల కోట్ల నిధులను సాంక్షన్  చేసింది. ఈ మేరకు విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా ఉత్తర్వులు రిలీజ్  చేశారు. 20 నియోజకవర్గాల్లో నిర్మించే ఈ స్కూళ్లకు ఒక్కో దానికి రూ.200 కోట్ల చొప్పున మంజూరు చేశారు.