జీతాల ఖర్చులో తెలంగాణకు 11వ ప్లేస్

జీతాల ఖర్చులో తెలంగాణకు 11వ ప్లేస్

ఎక్కువ శాతం జీతాలిస్తున్న పంజాబ్, కేరళ, మహారాష్ట్ర

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ల కోసం చేస్తున్న ఖర్చు తక్కువేనని పీఆర్సీ రిపోర్టులోని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2016–17 నాటి బడ్జెట్ లెక్కల ప్రకారం ఈ వివరాలను రిపోర్టులో వెల్లడించారు. ఉద్యోగుల జీతాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్న స్పెషల్ కేటగిరీ రాష్ట్రాల్లో.. ఉత్తరాఖండ్ (మొత్తం రెవెన్యూలో 58.6 శాతం శాలరీ ఖర్చు), త్రిపుర (54.7%), హిమాచల్ ప్రదేశ్ (54.5%), అస్సాం (52.7%), మిజోరం(50.9%), సిక్కిం (50.8%), మణిపూర్ (50.8%), అరుణాచల్ ప్రదేశ్ (47.8%) ఉన్నాయి. నాన్​స్పెషల్​ కేటగిరీలో పంజాబ్​ టాప్​లో ఉంది. పంజాబ్​లో రూ.55,296 కోట్ల రెవెన్యూ నుంచి.. రూ.22,275 కోట్లు (49.3 శాతం) జీతాలకు ఖర్చు చేస్తున్నారు. తర్వాత 91,096 కోట్ల రెవెన్యూలో 43,739 కోట్లు (48%) జీతాలిస్తూ కేరళ రెండో స్థానంలో… 2,13,229 కోట్ల రెవెన్యూలో రూ.88,929 కోట్లు (41.7 శాతం) జీతాలిస్తూ మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి. తెలంగాణలో రూ.81,432 కోట్ల రెవెన్యూలో రూ.30,930 కోట్లు (30.93%) జీతాలకు ఖర్చు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ దేశంలో 11వ స్థానంలో ఉండగా, నాన్​స్పెషల్​ కేటగిరీ రాష్ట్రాల్లో నాలుగో ప్లేస్​లో ఉంది.

For More News..

ఫిట్​మెంట్ జస్ట్​ 7.5 శాతమే.. మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు

రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు 1,91,126.. పీఆర్సీ రిపోర్ట్‌‌లో వెల్లడి